logo

మహనీయులను స్మరించుదాం: ఎంపీ

దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

Published : 10 Aug 2022 01:46 IST


జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌,
పాలనాధికారి శరత్‌, చిత్రంలో డీసీఎంఎస్‌ అధ్యక్షుడు శివకుమార్‌, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

సంగారెడ్డి టౌన్‌: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో దేశంలోని మొదటిసారిగా రాష్ట్రంలో వజ్రోత్సవాలు వైభవంగా ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని పేర్కొన్నారు. ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ భావి భారత పౌరులకు స్వాతంత్య్ర పోరాట చరిత్రపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, పాలనాధికారి శరత్‌, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ అధ్యక్షులు శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చెర్యాల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో
కంది, న్యూస్‌టుడే: మండల పరిధిలోని చెర్యాల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలోని మంగళవారం నిర్వహించిన వజ్రోత్సవాల్లో  ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి విద్యార్థులను బస్సుల ద్వారా సంగారెడ్డి నటరాజ్‌ థియేటర్‌కు తరలించి గాంధీ సినిమాను విద్యార్థులతోపాటు వారు వీక్షించారు. కార్యక్రమంలో పాలనాధికారి డా.శరత్‌, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ నరహరి రెడ్డి, ఎంపీపీ సరళ, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సర్పంచి శ్రావన్‌, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీఓ రవిందర్‌ పాల్గొన్నారు.

గాంధీకి నివాళి
సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: దేశానికి స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఘనత గాంధీకి దక్కిందని, ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేమని జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జడ్పీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్‌, అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, జిల్లా పాలనాధికారి శరత్‌, అదనపు కలెక్టర్లు సంగారెడ్డి పురపాలక సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, కంది ఎంపీపీ సరళ, కంది జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సంగారెడ్డి తహసీల్దార్‌ స్వామి నాయక్‌, తెరాస నాయకులు పాల్గొన్నారు.

వేడుకల ఏర్పాట్లపై సమీక్ష
సంగారెడ్డి టౌన్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై పాలనాధికారి శరత్‌ మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పరేడ్‌ మైదానంలో పొరపాట్లు జరగకుండా వేడుకల నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శకటాలు సహజ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సంబంధిత శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి రాధికారమణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని