logo

‘మల్లన్న’ సన్నిధిలో సందడి

మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో ఆదివారమూ కొమురవెల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాలు శనివారం సాయంత్రం నుంచే భక్తులతో నిండిపోయాయి.

Published : 06 Feb 2023 01:45 IST

గర్భగుడిలో ఉపసభాపతి పద్మారావు, కుటుంబ సభ్యులు

చేర్యాల, న్యూస్‌టుడే: మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో ఆదివారమూ కొమురవెల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాలు శనివారం సాయంత్రం నుంచే భక్తులతో నిండిపోయాయి. బస చేసిన భక్తులు ఆదివారం ఉదయం బోనాలతో ఆలయానికి చేరుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. రాజగోపురం, గంగరేణిచెట్టు వద్ద పట్నాలు వేయడానికి తరలిరావడంతో సందడి నెలకొంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మూడో ఆదివారం సుమారు పాతిక వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని అంచనా వేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాకే దేవాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని, రాష్ట్రంలోని అన్ని ఆలయాలు నూతన శోభ సంతరించుకున్నాయని అసెంబ్లీ ఉపసభాపతి టి.పద్మారావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక సిద్దం చేయించాలని ఆలయ అధికారులకు వారు సూచించారు. మల్లికార్జునస్వామిని టి.పద్మారావు కుటుంబ సభ్యులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట జడ్పీటీసీ సభ్యుడు సిద్దప్ప, ఆలయ ఛైర్మన్‌ భిక్షపతి, ఈవో బాలాజీ, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్‌, కమిటీ సభ్యులు ఉన్నారు.

మహామండపంలో పట్నాలు వేస్తున్న భక్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని