logo

గజ్వేల్‌లో 25 వేల ఓట్ల ఆధిక్యం తేవాలి: జగ్గారెడ్డి

రాహుల్‌గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా మెదక్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధును భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.

Published : 05 May 2024 01:09 IST

మాట్లాడుతున్న జగ్గారెడ్డి, చిత్రంలో చిట్టి దేవేందర్‌రెడ్డి, నర్సారెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, ఆంక్షరెడ్డి, గాడిపల్లి భాస్కర్‌

గజ్వేల్‌, న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా మెదక్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధును భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాజీవ్‌ రహదారి ప్రజ్ఞాపూర్‌ నుంచి గజ్వేల్‌లోని మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల కాలనీల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గజ్వేల్‌లోని ఓ వేడుక మందిరంలో నిర్వహించిన సభలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. బీసీ బిడ్డ నీలం మధు ఎంపీగా గెలవడానికి గజ్వేల్‌ దన్నుగా నిలవాలన్నారు. ఇక్కడ 25 వేలకు తగ్గకుండా ఓట్ల ఆధిక్యం తీసుకురావాలన్నారు. ఎవరైనా కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోనని గజ్వేల్‌ కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు. ఏం జరిగినా  క్షణాల్లో ఇక్కడికొచ్చి వాలిపోతానన్నారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల తర్వాత స్వయంగా వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని