logo

మతం బలహీనత కావొద్దు: మంత్రి

మతం బలహీనత కారాదని, అది సమాజంలో అసమానతలు, అసహనాన్ని పెంచేలా ఉండొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు.

Published : 05 May 2024 01:12 IST

సమావేశంలో మాట్లాడుతున్న దామోదర్‌ రాజనర్సింహ

పుల్కల్‌, న్యూస్‌టుడే: మతం బలహీనత కారాదని, అది సమాజంలో అసమానతలు, అసహనాన్ని పెంచేలా ఉండొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. పుల్కల్‌, చౌటకూరు మండలాల్లో శనివారం జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో సురేష్‌ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. విజయ పరంపరను స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొనసాగించాలన్నారు. పుల్కల్‌ వద్ద మంజీరా నదిపై వంతెన నిర్మించి సదాశివపేట- జోగిపేటతోపాటు సింగూరు బ్యాక్‌వాటర్‌ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ పెంచుతామన్నారు. చౌటకూరు మండలంలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ కళాశాలలో 30 ఎకరాల్లో సైన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని