logo

ఏబీవీపీ నుంచి ప్రస్థానం.. దశమంతరెడ్డి

జనగామ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆరుట్ల దశమంతరెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. జనగామ పట్టణానికి చెందిన ఆయన జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

Published : 23 Oct 2023 01:47 IST

చేర్యాల, న్యూస్‌టుడే: జనగామ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆరుట్ల దశమంతరెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. జనగామ పట్టణానికి చెందిన ఆయన జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏబీవీపీ ప్రతినిధిగా, సామాజిక సేవా కార్యక్రమాలు, న్యాయవాదిగా ప్రజలకు సుపరిచితుడు. ప్రస్తుతం జనగామ జిల్లా భాజపా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.


గతంలో కాంగ్రెస్‌.. ఇప్పుడు భాజపా

బెజ్జంకి, న్యూస్‌టుడే: మానకొండూర్‌ నియోజకవర్గ భాజపా అసెంబ్లీ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్‌ పేరును అధిష్ఠానం తొలి జాబితాలోనే ఖరారు చేసింది. ఇటీవల భారాసకు రాజీనామా చేసిన మోహన్‌ టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో చేరేందుకు మంతనాలు జరపగా ఫలించకపోవడంతో చివరికి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతగా గుర్తింపు పొందిన మోహన్‌కే భాజపా.. టికెట్‌ కేటాయించింది. మానకొండూర్‌ మండల కేంద్రానికి చెందిన మోహన్‌.. కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి, యువజన విభాగాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు హోదాల్లో పని చేశారు. మానకొండూర్‌ గ్రామంలో రెండు సార్లు సర్పంచిగా పని చేయగా 2009 వరకు కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా కొనసాగారు. అదే సంవత్సరం పునర్విభజనతో మానకొండూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ విప్‌గా పని చేశారు. తరువాత 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్‌, భారాస శ్రేణుల్లో పరిచయాలు గెలుపునకు కలసి వస్తాయని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని