logo

వీడిన ఉత్కంఠ

జిల్లాలో అన్ని శాసన సభా స్థానాలకు భాజపా అభ్యర్థిత్వాల ఎంపిక పూర్తయింది. మొదటి విడతలోనే ఇద్దర్ని ప్రకటించగా.. తాజాగా నాలుగో విడత ద్వారా మరో ఇద్దర్ని ఖరారు చేసింది. ఫలితంగా భాజపాలో ఉత్కంఠ వీడింది.

Published : 08 Nov 2023 02:37 IST

దూది శ్రీకాంత్‌రెడ్డి

న్యూస్‌టుడే, సిద్దిపేట, సిద్దిపేట అర్బన్‌: జిల్లాలో అన్ని శాసన సభా స్థానాలకు భాజపా అభ్యర్థిత్వాల ఎంపిక పూర్తయింది. మొదటి విడతలోనే ఇద్దర్ని ప్రకటించగా.. తాజాగా నాలుగో విడత ద్వారా మరో ఇద్దర్ని ఖరారు చేసింది. ఫలితంగా భాజపాలో ఉత్కంఠ వీడింది.

విద్యార్థి నేతగా మొదలై..

సిద్దిపేట భాజపా అభ్యర్థిగా దూది శ్రీకాంత్‌రెడ్డిని ఖరారు చేశారు. మొదటిసారిగా ఆయన బరిలో దిగుతున్నారు. వీరి స్వస్థలం సిద్దిపేట అర్బన్‌ మండలం తడ్కపల్లి. జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 1996 నుంచి విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలైంది. ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.   బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. 2020 నుంచి భాజపా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. శ్రీకాంత్‌రెడ్డి పేరు ఖరారు చేయడంతో సిద్దిపేటలో సంబురాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని మోదీ సభకు జిల్లా కేంద్రం నుంచి 12 బస్సుల్లో పార్టీ శ్రేణులు వెళ్లారు.

హుస్నాబాద్‌లో..

శ్రీరాంచక్రవర్తి

హుస్నాబాద్‌: బీసీ వర్గానికి చెందిన బొమ్మ శ్రీరాంచక్రవర్తిని హుస్నాబాద్‌ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు భాజపా ఖరారు చేసింది. ఈయన ఇందుర్తి మాజీ శాసనసభ్యుడు బొమ్మ వెంకటేశ్వర్‌ కుమారుడు. బీఈ, ఎల్‌ఎల్‌బీ వరకు చదువుకున్న ఆయన స్వగ్రామం కరీంనగర్‌. 2006లో హౌజ్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా పని చేశారు. కరీంనగర్‌లోని మున్నూరు కాపు వసతి గృహం,  వీరాంజనేయస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా ఉన్నారు. తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. భాజపాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని