logo

అరచేతిలో ఓటరు సమాచారం

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు సోమవారం వరకు కొత్త ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది.

Updated : 16 Apr 2024 06:23 IST

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ: లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు సోమవారం వరకు కొత్త ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో వందలాది మంది యువత ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు ఎలాంటి సందేహం ఉన్న నివృత్తి చేసుకునేలా ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అన్ని వివరాలు అరచేతిలోని మొబైల్‌లోనే తెలుసుకునేలా దీన్ని రూపొందించారు.

తనిఖీ చేసుకోవచ్చు ఇలా.. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌లో అవసరమైన సమగ్ర సమాచారం ఉంటుంది. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. చరవాణి సంఖ్యను నమోదు చేయగానే పేరు, వయసు, నియోజకవర్గం జిల్లా, వివరాలతో పాటు పోలింగ్‌ స్టేషన్‌ నంబరు, చిరునామా తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఎపిక్‌ కార్డును సైతం పొందే వీలుంది. ఓటు నమోదుకు కూడా ఇందులో అవకాశం కల్పించారు. అవసరమైన పత్రాలు, వివరాలతో కూడిన దరఖాస్తును అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. ఇదంతా అరచేతిలోనే సమాచారం పొందవచ్చు. దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. నచ్చిన భాషల్లో సమాచారం పొందవచ్చు.

ఓటర్‌ రిజిస్ట్రేషన్‌, సేవలు, ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌, ఎన్నికల వివరాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల సమాచారం, ఎన్నికల ఫలితాల సమాచారం తదితర విషయాలనూ తెలుసుకునే వీలుంది. కేంద్ర ఎన్నికల సంఘం గురించి, ఈవీఎం, వీవీప్యాట్‌, ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన తాజా సమాచారాన్ని పొందుపర్చారు. నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులతో పాటు సూచనలు చేసే అవకాశం ఉంది.


సులభంగా.. చరవాణిలో గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్‌ నంబరు వివరాలతో రిజిస్టర్‌ చేసుకుంటే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్‌ కాగానే పేజీ కనిపిస్తుంది. అందులో ఉండే సమాచారం మేర మనకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని