logo

కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం

కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన

Published : 02 May 2024 06:26 IST

కౌడిపల్లిలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు

కౌడిపల్లి, న్యూస్‌టుడే: కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి, నాయకులు క్రిష్ణగౌడ్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి నాసర్‌ఖాన్‌, ప్రతినిధులు మల్లేశం, క్రిష్ణ, వెంకటేశం, జావీద్‌, హరిబాబు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరించి, నినాదాలు చేస్తూ..

మెదక్‌ టౌన్‌: కార్మికుల చట్టాలను కేంద్రంలో భాజపా అధికారంలోకి రాగానే రద్దు చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చిందని.. వాటి రద్దుకు ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం పిలుపునిచ్చారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో నిర్వహించనున్న పోరాటాలకు మేడే సాక్షిగా అసంఘటిత కార్మికులు ఏకంకావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కేవల్‌ కిషన్‌ భవనం వద్ద జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజు, నాయకులు మొహినొద్దీన్‌, షౌకత్‌ఆలీ, కిష్టయ్య, అనిల్‌, అజయ్‌, దుర్గా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని