అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ ఆరా
వ్యవసాయ పంటలు సాగు చేసే భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు.
మునుగోడులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్న తహసీల్దారు కృష్ణారెడ్డి
మునుగోడు, న్యూస్‌టుడే: వ్యవసాయ పంటలు సాగు చేసే భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. మునుగోడు మండల కేంద్రంలో విలువైన భూముల్లో నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ‘ అనుమతుల్లేవ్.. అడ్డగింతల్లేవ్! ’ అనే కథనం ఈ నెల 23న ఈనాడులో ప్రచురితమైంది. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆరా తీసినట్లుగా తెలిసింది. ఆ నిర్మాణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఈ మేరకు ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీపీవో విష్ణువర్ధన్‌రెడ్డి మండలస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక తహసీల్దారు కృష్ణారెడ్డి నిర్మాణాలు చేపడుతున్న ప్రదేశానికి వెళ్లి తమ వద్ద ఉన్న పత్రాలను తీసుకరావాలని సూచించారు. అలాగే అక్రమంగా జరుగుతున్న నిర్మాణ పనులను నిలిపి వేయాలని గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి వెంటనే నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శికి చెప్పినట్లుగా స్థానిక ఎంపీడీవో జానయ్య తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kishan Reddy: తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా?: కిషన్‌రెడ్డి
-
Movies News
Spider Man: ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులకు తీపి కబురు
-
Sports News
MS Dhoni: విజయవంతంగా ధోని మోకాలికి శస్త్రచికిత్స
-
Crime News
Kurnool: జగన్ ప్రసంగిస్తుండగా యువకుడిపై పోలీసుల దాడి
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?