logo

పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాల కేటాయింపు

రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను కేటాయించారు.

Updated : 04 May 2024 17:05 IST

భువనగిరి: రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను కేటాయించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలింగ్ కేంద్రాలకు రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎం యంత్రాలను కేటాయించారు. 25 శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా వీవీప్యాట్లు కేటాయించారు. మొత్తం 2,141 పోలింగ్ కేంద్రాలకు 8,023 బ్యాలెట్ యూనిట్లు, 2,673 కంట్రోల్ యూనిట్లు, 2,994 వివిప్యాట్లు కేటాయించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఉప ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్, భువనగిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్.డి.ఓ. అమరేందర్, మునుగోడు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి.సుబ్రహ్మణ్యం, నకిరేకల్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పూర్ణచందర్, తుంగతుర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి.ఎస్. లత, జనగాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి.కొమరయ్య, ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె.అనంతరెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఇ.డి.ఎం. సాయి కుమార్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని