logo

మాట్లాడలేడు.. నడవలేడు

తంగడపల్లికి చెందిన ఈ బాలుడు ఊదరి పవన్‌కుమార్‌. జన్మించినప్పుడు ఏడవలేదు. వయసు పెరుగుతుంటే మాటలొస్తాయి.. అంతా బాగుంటుంది అని వైద్యులు చెప్పారు.

Published : 01 Jun 2023 03:11 IST

పద్నాలుగేళ్లుగా సేవలందిస్తున్న తల్లిదండ్రులు

తంగడపల్లికి చెందిన ఊదరి పవన్‌కుమార్‌ను ఎత్తుకున్న తల్లిదండ్రులు బాబు, అనురాధ

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: తంగడపల్లికి చెందిన ఈ బాలుడు ఊదరి పవన్‌కుమార్‌. జన్మించినప్పుడు ఏడవలేదు. వయసు పెరుగుతుంటే మాటలొస్తాయి.. అంతా బాగుంటుంది అని వైద్యులు చెప్పారు. ఇప్పటికీ పద్నాలుగేళ్లయింది. అస్పష్టంగా అమ్మానాన్న అని అంటాడు. అంతకు మించి మాటలేం రావు. ఇప్పటికీ సొంతంగా నడవలేడు. ఎక్కడికైనా వెళ్లాలంటే తల్లిదండ్రులు చంటి పిల్లాడిలా చంకనెత్తుకుని తీసుకువెళ్లాల్సిందే. వాతావరణం చల్లగా మారినప్పుడు ఈ బాలుడికి ఫిట్స్‌ వచ్చి పడిపోతుంటాడు. అతని అవసరాలను, వాతావరణ పరిస్థితులను గమనించి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తల్లిగానీ, తండ్రిగానీ నిరంతరం వెంట ఉండాల్సిందే. రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం వీరిది. వీరికి ముగ్గురు అబ్బాయిలు, ఒకమ్మాయి. తండ్రి తాపీ మేస్త్రీగా పని చేసి సంపాదించే కూలీ డబ్బులతో కుటుంబం గడుస్తుంది. చౌటుప్పల్‌లో నలుగురు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. కనీసం మూడు చక్రాల సైకిల్‌ కూడా లేకపోవడంతో పద్నాలుగేళ్లుగా వారి భుజాలపైనే మోస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని