logo

పరీక్షలు కానేలేదు.. పాఠశాలల మూసివేత..!

ఈ చిత్రంలోని పట్టికను పరిశీలిస్తే ఈ నెల 15 నుంచి 22 వరకు 1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే పరీక్షలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

Published : 16 Apr 2024 03:13 IST

ఈ చిత్రంలోని పట్టికను పరిశీలిస్తే ఈ నెల 15 నుంచి 22 వరకు 1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే పరీక్షలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ పరీక్ష షెడ్యూల్‌ వర్తిస్తుంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఇంకా వారం రోజుల వరకు పాఠశాలలు నిర్వహించాలి. ఇప్పుడు మూసివేసిన ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు పరీక్ష నిర్వహించకుండానే నిర్వహించినట్లు విద్యాశాఖకు మార్కుల పట్టిక కూడా పంపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.


  • మునగాల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఆ విద్యార్థినికి అప్పుడే సెలవులు ఇవ్వడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఇతర పాఠశాలలపై ఆరా తీసి, పాఠశాల నిర్వాహకుడికి చరవాణిలో సంప్రదించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. కోదాడలో సుమారు 32 పాఠశాలలు ఉండగా.. వాటిలో 25 వరకు మూసివేసినట్లు విశ్వసనీయ సమాచారం. కోదాడతో పాటు, జిల్లా వ్యాప్తంగా పేరొందిన పాఠశాలలు కూడా మూసివేసినట్లు తెలుస్తోంది.

కోదాడ, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలల నిర్వాహకుల్లో కొంత మంది ప్రభుత్వం సెలవులు ఇవ్వకముందే పాఠశాలలు మూసివేశారు. ఈ నెల 24 వరకు పాఠశాలలు నడపాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా.. కొంత మంది విద్యుత్‌ బిల్లులు, మెస్‌ బిల్లులు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులు మార్చి నెల వరకే లెక్క చూసి, ముందస్తుగానే పాఠశాలలు మూసివేశారు. ఫీజులు పూర్తి స్థాయిలో వసూలు చేసి, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే సెలవులు ఇవ్వడం ఏంటని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.  

నష్టపోతున్న విద్యార్థులు:

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,100 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవి నడుచుకోవాలి. అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో రాష్ట్ర విద్యా శాఖ అందించే ప్రశ్నపత్రాలతో పరీక్షలు పెట్టని దుస్థితి. చాలా మందికి వార్షిక పరీక్ష ప్రశ్న పత్రాలు ప్రభుత్వం నుంచి వస్తాయని కూడా తెలియదు. నిర్వాహకులు మాత్రం అధికారికంగా వార్షిక పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం కొసమెరుపు.


వార్షిక పరీక్షలు నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటాం:

అశోక్‌, జిల్లా విద్యాధికారి, సూర్యాపేట

ఈ నెల 15 నుంచి 22 వరకు ప్రతి ప్రైవేటు పాఠశాలలో వార్షిక పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటాం. కొన్ని పాఠశాలలు ముందస్తుగానే సెలవులు ఇచ్చిన అంశం విచారణ చేసి, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని