logo

భువనగిరి లోక్‌సభ స్థానానికి 61 మంది నామినేషన్లు

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. రికార్డ్ స్థాయిలో 61 మంది నామినేషన్లు వేశారు.

Published : 25 Apr 2024 21:34 IST

భువనగిరి: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. రికార్డ్ స్థాయిలో 61 మంది నామినేషన్లు వేశారు. నిన్నటి వరకు 45 మంది నామినేషన్లు వేయగా. చివరి రోజు అయిన గురువారం 16 మంది నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీ అయినా కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భాజపా నించి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, భారాస నుంచి క్యామ మల్లేష్, సీపీఎం నుంచి ఎండి జాంగిర్ నామినేషన్ వేయగా.. మిగిలినవార్లు రిజిస్ట్రార్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగింది. రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని