logo

సాధించా‘ఆరు’..!

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది రాష్ట్రంలో 15వ స్థానాన్ని కైవసం చేసుకున్న సూర్యాపేట జిల్లా ఈ ఏడాది ఆరో స్థానంలో నిలిచింది.

Updated : 01 May 2024 06:30 IST

మహాత్మాగాంధీ రోడ్డు (సూర్యాపేట), న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది రాష్ట్రంలో 15వ స్థానాన్ని కైవసం చేసుకున్న సూర్యాపేట జిల్లా ఈ ఏడాది ఆరో స్థానంలో నిలిచింది. గత ఏడాది 89.93 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ సారి 96.91 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చుకుంటే 7.2 శాతం ఉత్తీర్ణత పెరిగింది.

బాలికల ముందంజ..  ఫలితాల్లో 97.72 శాతం ఉత్తీర్ణతతో బాలుర కంటే బాలికలే ముందంజలో నిలిచారు. పరీక్షకు హాజరైన 11,910 మందిలో 11,542 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 6,198 మందికి 5,960, బాలికలు 5,712 మందికి 5,582 మంది ఉత్తీర్ణత సాధించారు. గరిష్ఠ మార్కులు సాధించడంలో ఎక్కువ మంది పోటీ పడ్డారు. 196 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. ఇందులో ప్రభుత్వ 109, ప్రైవేట్‌ విద్యాసంస్థలు 87 ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మొత్తంగా 354 మంది పది జీపీఏ సాధించడం విశేషం.

10 జీపీఏ సాధించిన వారు..

ప్రభుత్వ పాఠశాలల్లో పది జీపీఏ సాధించిన వారిలోనూ బాలికలే ఉండటం గమనార్హం. జిల్లాలోని అర్వపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన మేకల మహేశ్వరి, చెన్నబోయిన పల్లవి, గుదిబండ జడ్పీ హైస్కూల్‌(కోదాడ) విద్యార్థినులు గుండిబోయిన సమంత, కందనబోయిన కల్పన, గండూరి జానకమ్మ మెమోరియల్‌ హైస్కూల్‌(సూర్యాపేట)కు చెందిన విద్యార్థిని ఖమ్మంపాటి హారిక 10కి 10 జీపీఏ సాధించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని