logo

తీవ్ర ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Published : 05 May 2024 15:45 IST

భువనగిరి: తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉష్ణో్గ్రత 46 డిగ్రీల సెల్సియస్ ఉందని, ఎండలో తిరిగితే ఈ వ్యత్యాసం వలన శరీరంలో టెంపరేచర్ పెరిగే క్రమంలో శరీరంలో ఉన్న ఖనిజ లవనాలు, నీరు ఆవిరైపోయి డీహైడ్రేషన్‌కు గురవుతారని ఆయన వివరించారు. తీవ్ర వేడికి వడ దెబ్బ తగులుతుందని, దీనివలన విపరీతమైన జ్వరం, తలనొప్పి, తల తిప్పటం, వికారము, వాంతులు, అంతేకాకుండా విపరీతమైన చెమటలు పట్టి చర్మం పొడిగా మారుతుందని అన్నారు. రోజువారి పనిచేసే కూలీలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 108కు కాల్ చేసి ఆసుపత్రికి పంపించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకొని రక్షణ పొందాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని