logo

కేసీఆర్‌ పథకాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం: మాజీ మంత్రి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన పథకాన్ని కొనసాగిస్తున్నారు.. తప్పా కొత్తగా రైతులకు ఒరగబెట్టిందేమి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 06 May 2024 02:38 IST

గుంపులలో ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

చివ్వెంల, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన పథకాన్ని కొనసాగిస్తున్నారు.. తప్పా కొత్తగా రైతులకు ఒరగబెట్టిందేమి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మండలంలోని ఉండ్రుగొండ, గుంపుల గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు అనేది రైతుల హక్కు అని, దాన్ని రైతు భరోసాగా చెప్పుకుంటున్న సీఎంను చూస్తే జాలేస్తోందన్నారు.  సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఏ ఒక్క అన్నదాతకైనా రైతు భరోసా ఇచ్చినట్లుగా నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. ఐదు నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల పాలయ్యారని విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా అడ్డగోలు హామీలు ఇస్తున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పది శాతానికి పడిపోయిందన్నారు. ఎన్నికల నాటికి మరింతగా దిగజారనుందని పేర్కొన్నారు. నల్గొండ భారాస ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమాల్లో భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, పార్టీ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు భూక్యా సంజీవ్‌నాయక్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మారినేని సుధీర్‌రావు, కౌన్సిలర్‌ ఎస్‌కే.బాషా, నాయకులు రౌతు నరసింహరావు, బాబునాయక్‌, గోవిందరెడ్డి, సైదిరెడ్డి, సాగర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని