logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లుకు ఇబ్బందులు కలగొద్దు

ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు.

Published : 07 May 2024 06:54 IST

 నల్గొండలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన
నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి మెమోరియల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే ప్రక్రియను పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు, అవసరమైన టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. హెల్ప్‌డెస్క్‌లో సిస్టమ్‌ లేదా లాప్‌టాప్‌ ఆధారంగా ఎపిక్‌నెంబర్‌ను పరిశీలించి ఓటు వేసే గది ఇతర వివరాలను స్పష్టంగా తెలపాలన్నారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఓటు వేసేలా అవకాశం కల్పించాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ జిల్లా నోడల్‌ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు..

 నల్గొండ సంక్షేమం: వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనిశెట్టిదుప్పలపల్లిలోని గోదాంలో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన సోమవారం పరిశీలించారు. లెక్కింపునకు నాలుగు హాళ్లు ఉండాలని, ప్రతి హాల్‌లో 25 టేబుల్స్‌ ఉండే విధంగా చూడాలన్నారు. స్ట్రాంగ్‌రూం ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు, బ్యాలెట్‌ పెట్టెల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ ఈఈ భూమయ్య, సర్వే లాండ్‌ రికార్డ్సు ఏడీ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని