logo

పోలింగ్‌ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి

పోలింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నోడల్ అధికారులను ఆదేశించారు.

Updated : 07 May 2024 21:19 IST

భువనగిరి: పోలింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాలులో ఆయన వివిధ విభాగలకు చెందిన నోడల్ అధికారులతో సమావేశమై పోలింగ్ ముందు, పోలింగ్ రోజున చేపట్టే విధుల పట్ల సమీక్షించారు. రిపోర్టులను సకాలంలో సమర్పించాలని, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మార్క్‌డ్ కాపీలు సిద్ధం చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి  పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలు, సిబ్బంది కోసం బస్సులను సిద్ధం చేయాలని ఆదేశించారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాలలో ఆశా, వైద్య సిబ్బంది, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్స్, కనీస మందులు ఏర్పాటు చేయాలని, మెడికల్ సిబ్బంది నియామకం ప్లాన్ ప్రకారం నిర్వహించాలని, భువనగిరి ఆరోరా కాలజీలో, ఆలేరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటయ్యే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో 12వ తేదీ ఉదయం నుండి 13వ తేదీ రాత్రి వరకు మెడికల్ శిబిరాలు, అబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్  నాగేశ్వరా చారి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు