logo

వారి భవిత రాసేది.. యువతే..!

లోక్‌సభ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. తమ రాతను ఎలా మార్చుకోవాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Updated : 08 May 2024 06:26 IST

భువనగిరి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. తమ రాతను ఎలా మార్చుకోవాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గుర్తించి.. చర్చించి.. ఆలోచించి.. అవగాహనతో ఓటుహక్కు వినియోగించుకునే సమయం సమీపించింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 18,08,585 మంది ఉన్నారు. ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల వయస్సు యువకులే సగానికిపైగా 9,29,525 మంది ఓటర్లు ఉన్నారు. వీరి శాతం 51.40 ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలు, తొలిసారి ఓటు హక్కు వినయోగించుకునే 18-19 ఏళ్ల వయసున్న వారు 61,813 మంది ఉన్నారు. 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు కూడా 3,52,333 మంది ఉన్నారు. 40 నుంచి 49 ఏళ్లున్న ఓటర్లను కలుపుకొంటే 50 ఏళ్ల లోపున్న ఓటర్లు సంఖ్య 12,81,858 చేరుకుంది. మొత్తం ఓటర్లలో వీరి శాతం 70.88 ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో యువత కీలకంగా కానున్నారు. దాదాపు వీరంతా చదువున్న వారే. ప్రలోభాలకు గురికాకుండా విచక్షణతో ఓటేస్తే మంచి ఫలితం వస్తుంది. మిగిలిన ఓటర్లు 5,26,727 (29.12శాతం) మాత్రమే ఉండగా వీరిలో చాలామంది వయోధికులు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా యువ ఓటర్లపైనే గురిపెట్టారు. యువత ఉపాధి, స్వయం ఉపాధి, వృత్తి నైపుణ్య శిక్షణపై హామీలు గుప్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు