logo

శోభాయమానం.. నవ నృసింహుల సాలహారం

మట్టపల్లి క్షేత్రంలో నవ నృసింహుల దివ్య స్వరూపాలతో సాలహారం నిర్మించాలన్న భక్తుల చిరకాల స్వప్నం సాకారమైంది. ఇక్కడి రాజ గోపురానికి ఇరువైపులా ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తొమ్మిది నారసింహ క్షేత్రాల్లోని స్వయంభువులను ఆలయ ప్రాకారంలో తీర్థజనులు సందర్శించేలా తీర్చిదిద్దారు.

Published : 08 May 2024 03:43 IST

మఠంపల్లి, న్యూస్‌టుడే: మట్టపల్లి క్షేత్రంలో నవ నృసింహుల దివ్య స్వరూపాలతో సాలహారం నిర్మించాలన్న భక్తుల చిరకాల స్వప్నం సాకారమైంది. ఇక్కడి రాజ గోపురానికి ఇరువైపులా ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తొమ్మిది నారసింహ క్షేత్రాల్లోని స్వయంభువులను ఆలయ ప్రాకారంలో తీర్థజనులు సందర్శించేలా తీర్చిదిద్దారు. దేవాలయ నిధులు రూ.30లక్షలతో 130 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన మండప ఆకృతుల్లో మట్టపల్లి లక్ష్మీనృసింహుడు, వాడపల్లి జ్వాలా నృసింహుడు, కేతవరం వజ్రాల నృసింహుడు, వేదాద్రి యోగానంద లక్ష్మీనృసింహస్వామి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, అహోబిలం జ్వాలా నరసింహస్వామి, సింహాచలం వరాహ నరసింహస్వామి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి తేజోమూర్తులు ఆసీనులైనట్లు చిత్రకారులు కళానైపుణ్యాన్ని చాటి పంచవర్ణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈనెల 21 నుంచి పంచాహ్నికంగా జరిగే శ్రీస్వామి బ్రహ్మోత్సవాలకు సాలహారం పూర్తి చేయాలన్న తమ సంకల్పం నెరవేరిందని ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని