logo

ర్యాలీలో.. జాలీగా

రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటరావు పేర్కొన్నారు.

Published : 09 May 2024 06:36 IST

సూర్యాపేటలో ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటరావు, ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటరావు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీని ఎస్పీ రాహుల్‌ హెగ్డేతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఓటు మన జన్మహక్కు అని తెలిపారు. ఓటరుతోపాటు ఎన్నికలకు అత్యంత రక్షణ, భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు విద్యాశాఖకు మొదటి, డీఆర్డీవో రెండో, మెప్మా, పుర శాఖలకు మూడో స్థానాలుగా జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో స్వీప్‌ నోడల్‌ అధికారి, డీఈవో అశోక్‌, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో మధుసూదన రాజు, డీఎఫ్‌వో సతీష్‌ కుమార్‌, ఏఎస్పీ నాగేశ్వరరావు, శిక్షణ ఐపీఎస్‌ రాజేశ్‌ మీనా, సీపీవో ఎల్‌.కిషన్‌, ఆర్డీవో వేణుమాధవ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని