logo

నీటికుంట.. తీర్చును తంటా!

నీటి నిల్వ సాంద్రత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ ఫారం పాండ్స్‌ (నీటి కుంటలు) నిర్మాణం చేపడుతున్నారు.

Published : 09 May 2024 06:44 IST

జిల్లాలో 2,997 నిర్మాణాలు

నీటికుంట నిర్మాణంలో ఉపాధి హామీ కూలీలు

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: నీటి నిల్వ సాంద్రత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ ఫారం పాండ్స్‌ (నీటి కుంటలు) నిర్మాణం చేపడుతున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ స్థలాల్లో నీటి కుంటల నిర్మాణం చేపడితే.. భూగర్భ జలాలు పెరగడంతో పాటు అడవిలోని జంతువులు, పక్షులకు, చెట్లకు సరిపడా నీరు అందనుంది. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,923 ఫారం పాండ్స్‌(నీటి కుంటల) నిర్మాణ పనులు చేపట్టారు.

 కూలీలకు ఉపాధి..

నీటి కుంటల నిర్మాణం చేపట్టడంతో నీటి నిల్వలు, నీటి విస్తీర్ణం పెర[గడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. వరద నీరు నిల్వ ఉండటంతో భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో స్థానికంగా పనులు లేకపోవడంతో కూలీలకు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పథకం ద్వారా కూలీలకు సరిపడా పనులు కల్పించినట్లవుతుంది.

గ్రామసభల్లో తీర్మానం..

జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో 2,997 నీటి కుంటల నిర్మాణం లక్ష్యంగా కాగా 2,923 నిర్మాణ పనులు పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. నీటి కుంటలను ఏ ప్రదేశంలో నిర్మిస్తే వరద నిల్వ ఉంటుంది, ఎక్కడ నిర్మిస్తే జంతువులతో పాటు, పశువులు, జీవులకు అవసరం అవుతుందనేది గ్రామసభల్లో తీర్మానం చేస్తారు. అనంతరం అటవీ శాఖ అనుమతులతో నిర్మాణం చేపడుతున్నారు.

జల సంరక్షణతో ప్రయోజనం

కమ్యూనిటీ వాటర్‌ హార్వెస్టింగ్‌(నీటి సేకరణ) ఫారం పాండ్స్‌(నీటి కుంటలు) నిర్మాణంలో అటవీ ప్రాంతాల్లో జలసంక్షరణ, భూగర్భ జలాలు పెరగడంతో పాటు జీవాలకు నీరు అందుతుంది. వృక్ష సంపద వృద్ధి చెందుతుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో నీటి కుంటల నిర్మాణ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

 కృష్ణన్‌, డీఆర్డీవో, యాదాద్రి భువనగిరి జిల్లా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని