logo

ఐదేళ్లలో.. మూడు లక్షలు పెరిగె..!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ- 2024 ప్రక్రియలో భాగంగా.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల తుది ఓటరు జాబితా ఇటీవలే విడుదలైంది.

Updated : 09 May 2024 06:59 IST

రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో 35,34,050 మంది ఓటర్లు
మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ- 2024 ప్రక్రియలో భాగంగా.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల తుది ఓటరు జాబితా ఇటీవలే విడుదలైంది. ఈ జాబితాలను ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు సైతం పంపిణీ చేశారు. ప్రస్తుత జాబితా ప్రకారం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 8,44,843 మంది, మహిళలు 8,80,453 మంది, థర్డ్‌ జెండర్‌ 169 మంది ఉన్నారు. భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 18,08,585 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,98,416 మంది, మహిళలు 9,10,090 మంది, థర్డ్‌ జెండర్‌ 79 మంది ఉన్నారు.

 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 3,21,213 మంది ఓటర్లు పెరిగారు. నల్గొండ లోక్‌సభ పరిధిలో మొత్తం 1,40,155 మంది ఓటర్లు పెరగగా.. మహిళలు 79,281 మంది, పురుషులు 60,835 మంది, థర్డ్‌జెండర్‌ 142 మంది పెరిగారు. పోలింగ్‌ కేంద్రాలు 70 పెరిగి 2,060కి చేరాయి. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,81,058 మంది ఓటర్లు పెరగగా.. మహిళలు 1,01,165 మంది, పురుషులు 79,844 మంది, థర్డ్‌జెండర్‌ 49 మంది పెరిగారు. ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాలు 73 పెరిగి 2,141కి చేరాయి.

అక్కడ ఇబ్రహీంపట్నం.. ఇక్కడ దేవరకొండ

భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 3,39,341 మంది ఓటర్లు ఉండగా.. భువనగిరిలో అతి తక్కువగా 2,20,596 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. నల్గొండ లోక్‌సభ స్థానం పరిధిలో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 2,62,480 మంది ఓటర్లు ఉండగా.. మిర్యాలగూడ నియోజకవర్గంలో అతి తక్కువగా 2,36,343 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే దేవరకొండలో అత్యధికంగా, భువనగిరిలో అతి తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 56 మంది థర్డ్‌జెండర్లు ఉండగా.. భువనగిరిలో అతి తక్కువగా ఒక్కరు మాత్రమే ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని