logo

ఈవీఎంల కేటాయింపు పూర్తి

భువనగిరి లోక్‌సభ స్థానం ఎన్నికకు 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,141 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం అవుతున్నాయి.

Published : 09 May 2024 06:57 IST

20 శాతం అదనంగా బ్యాలెట్‌ యూనిట్లు

ఆలేరు: ఇండోర్‌ స్టేడియంలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరుతున్న ఎన్నికల సామగ్రి

ఆలేరు, న్యూస్‌టుడే: భువనగిరి లోక్‌సభ స్థానం ఎన్నికకు 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,141 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం అవుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సామగ్రి కేటాయింపు పనులు చివరి దశకు చేరాయి. నియోజకవర్గంలో 25 శాతం బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లను అదనంగా అందుబాటులో ఉంచారు. భువనగిరి లోక్‌సభ స్థానానికి ఈ నెల 13న జరగనున్న ఎన్నికకు ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 2,141 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 8,023 బ్యాలెట్‌ యూనిట్లు, 2,673 కంట్రోల్‌ యూనిట్లు, 2,994 వీవీ ప్యాట్లను కేటాయించారు. బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లను 20 శాతానికిపైగా, వీవీ ప్యాట్లను 40 శాతం వరకు అదనంగా అందుబాటులో ఉంచారు.

సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్‌ రూమ్‌లు

భువనగిరి: అరోరా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల, భువనగిరి
నకిరేకల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నకిరేకల్‌
తుంగతుర్తి: వ్యవసాయ మార్కెట్‌ గోదాం, తుంగతుర్తి
ఆలేరు: ఇండోర్‌ స్టేడియం, ఆలేరు
మునుగోడు: డాన్‌బాస్కో జూనియర్‌ కళాశాల, చండూరు
జనగామ: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జనగామ
ఇబ్రాహీంపట్నం: గురునానక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ క్యాంపస్‌, ఖానాపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని