logo

ఓటర్లకు ఆహ్వానం

ఓ శుభకార్యానికి ఆహ్వానం వస్తే అందరం ఆ తేదీ గుర్తు పెట్టుకుని తప్పకుండా హాజరవుతాం. అలాంటిది ఏకంగా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసే, మన భవితను తీర్చిదిద్దే ఓటుకు రమ్మని ఓటరును ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారేమో..!

Published : 09 May 2024 06:57 IST

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆహ్వాన పత్రిక

హుజూర్‌నగర్‌: ఓ శుభకార్యానికి ఆహ్వానం వస్తే అందరం ఆ తేదీ గుర్తు పెట్టుకుని తప్పకుండా హాజరవుతాం. అలాంటిది ఏకంగా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసే, మన భవితను తీర్చిదిద్దే ఓటుకు రమ్మని ఓటరును ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారేమో..! ఆలోచన వచ్చిందే తడవుగా ఒక వినూత్న ఆహ్వాన పత్రిక తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో ఓటరును ఓటుకు రమ్మంటూ ఆహ్వానం పంపుతున్నారు. ఓటరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకొనేలా ఆహ్వానిస్తూ సందేశం పంపుతున్నారు. ముహూర్తం: ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, వేదిక: పోలింగ్‌ కేంద్రం, విందు: ఐదేళ్లపాటు శక్తిమంతమైన ప్రజాస్వామ్య ఫలాలు అంటూ ఆంగ్లంలో ముద్రించిన ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది అందరినీ ఆకర్షించడమే కాకుండా ఆలోచింపజేస్తోంది. ఓటింగ్‌ శాతం పెంచుకునేందుకు ఇలాంటి చిట్కాలు కూడా ఎంతో తోడ్పడతాయంటున్నారు నెటిజన్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని