logo

నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!

ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.

Published : 10 May 2024 06:30 IST

హుజూర్‌నగర్‌, హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 25,78,210 మంది ఓటర్లు ఉండగా 22,69,451 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 3.08 లక్షల మంది ఓటర్లు వినియోగించుకోలేదు. ఏ దేశంలో ఓటరు నిజాయతీగా ఓటును వినియోగించుకుంటాడో ఆ దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. అలాగే ఓటింగ్‌ శాతం తక్కువ ఉన్న దేశాల్లో ధనస్వామ్య వ్యవస్థ పాతుకు పోతుందంటున్నారు చరిత్రకారులు. ప్రజాస్వామ్యంలో ఓటును నిర్లక్ష్యం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని, సమస్యలు పరిష్కారం కావని చెబుతున్నారు. ఫలితంగా అభివృద్ధిలో వెనకబడటం తప్పదు. అందుకే కొన్ని దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి చేశారు. ఒక వేళ ఓటు వేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటున్న దేశాలూ ఉన్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంటోంది. మన దేశంలోనూ ఓటును వినియోగించడం తప్పనిసరి చేయాలని, వినియోగించుకోని వారిపై చర్యలైనా తీసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని