logo

తస్మాత్‌ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!

లోక్‌సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు.

Published : 10 May 2024 06:41 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ యంత్రాంగం ఎన్నికల నియమావళిని అమలు చేయనుంది. స్థానికేతరులు, ఓటరు కాని వాళ్లు గ్రామాలు, పట్టణాల్లో తీరగకూడదు. కొత్త వ్యక్తులకు ఇళ్లు, లాడ్జిల్లో ఆశ్రయం ఇవ్వకూడదు. తప్పనిసరి పరిస్థితి అయితే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆధార్‌ కార్డు చూపి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా అంతటా 144 చట్టం అమల్లో ఉన్నందున అయిదుగురికి మించి ఎక్కడా గుంపులుగా కన్పించకూడదు. సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలు చేయడం ఓటరును ప్రలోభాలకు గురి చేసే ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయొద్దు. మద్యం దుకాణాల్లో అమ్మకాలు నిలిపి వేయడంతో పాటు బెల్టుదుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల పనితీరు ముమ్మరం చేయడంతో పాటు రాష్ట్ర, అంతర్జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల్లో పకడ్బంధీగా తనిఖీలుంటాయి. ఈమేరకు పోలీసు యంత్రాంగం ఇప్పటి నుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని