logo

రౌడీ షీటర్లపై నిఘా పెంచండి : ఎస్పీ

జిల్లాలోని రౌడీషీటర్లు, డీసీ, కేడీ సస్పెక్టడ్‌ షీట్ల కదలికలపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ నుంచి ఆయన జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసు అధికా

Published : 28 Jan 2022 01:17 IST


వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ

 

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే : జిల్లాలోని రౌడీషీటర్లు, డీసీ, కేడీ సస్పెక్టడ్‌ షీట్ల కదలికలపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ నుంచి ఆయన జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీసుస్టేషన్ల పరిధిలో ఎంత మంది రౌడీ షీటర్లు ఉన్నారు? ప్రస్తుతం వారేం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. వారి వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో అప్‌డేట్‌ చేయాలన్నారు. ప్రతి ఆదివారం అన్నీ పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, సస్పెక్టెడ్‌ షీటర్లను పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకట రత్నం, డీఎస్పీలు ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని