logo

ఆనంవి నీచ రాజకీయాలు: నేదురుమల్లి

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 02:35 IST

ప్రసంగిస్తున్న నేదురుమల్లి

రాపూరు, న్యూస్‌టుడే: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన రాపూరులోని (మద్దెలమడుగు) తెలుగుగంగ అతిథి గృహంలో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో వైకాపా విజయమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. రాపూరు మండలాధ్యక్షుడు ఆనం అనుచరుడైన చెన్ను బాలకృష్ణారెడ్డికి పార్టీలో స్థానం లేదన్నారు. ఆయన పార్టీలో ఉన్నా తన పక్కన కూర్చోబెట్టుకునేది లేదన్నారు. గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో సీఎం జగన్‌ని, పార్టీపైనా ఆనం లేనిపోని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. రాపూరు మండలంలోని నామినేటెడ్‌ పదవులన్నీ ఎంపీపీ చెన్ను కుటుంబ సభ్యులకే కట్టబెట్టారన్నారు. కాంట్రాక్టు పనులను కూడా తన సొంత మనుషులకే ఇప్పించి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. నాయకులు పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, పాపకన్ను దయాకర్‌రెడ్డి, కార్పొరేషన్‌ ఛైర్మన్లు మేరిగ మురళీధర్‌, పొట్టేళ్ల శిరీష, మండల జూసీఎస్‌ కన్వీనర్‌ దందోలు  నారాయణరెడ్డి, రాపూరు సర్పంచి భూపతి జయమ్మ, బత్తిన పట్టాభిరామిరెడ్డి  తదితరులు ఉన్నారు.

సైదాపురం: గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు వైకాపా సైన్యమని ఆపార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్‌, వెంకటగిరి నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సైదాపురంలో సోమవారం గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ ఛైర్మన్‌ పొట్టేళ్ల శిరీష, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కన్వీనర్‌ మురళి, మండల జేసీఎస్‌ కన్వీనర్‌ రవికుమార్‌ ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని