logo

పార్టీకి మాజీ ఎమ్మెల్యే సీవీ రాజీనామా

కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుడిగా గుర్తింపున్న మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి ఆ పార్టీని వీడారు.

Published : 16 Apr 2024 03:03 IST

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుడిగా గుర్తింపున్న మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి ఆ పార్టీని వీడారు. దర్గామిట్టలోని ప్రైవేటట్‌ కల్యాణ మండపంలో సోమవారం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించి కన్నీరు పెట్టుకుని రాజీనామా విషయాన్ని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరులో శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి సహకారంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. 1978-83, 89-94లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేశానని తెలిపారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పది సంవత్సరాలు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు పనిచేశానన్నారు. వయోభారం, ఆర్థిక ఇబ్బందులతోనే పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. సమావేశంలో సీనియర్‌ నాయకులు రఘురామ్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని