logo

రామాలయాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ

శ్రీరామనవమి సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపడుతున్నామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ తెలియజేశారు.

Updated : 16 Apr 2024 16:49 IST

కలెక్టరేట్‌:  శ్రీరామనవమి సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపడుతున్నామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ ప్రాంగణాల్లో మంచినీటి సదుపాయం, చెత్తడబ్బాల ఏర్పాటు, బ్లీచింగ్, సున్నం చల్లటం వంటి చర్యలతో పాటు అన్న ప్రసాద వితరణ సమయంలో పడవేసే వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా పర్యవేక్షించినున్నామని వెల్లడించారు. అనంతరం స్థానిక ట్రంక్ రోడ్డులోని కె.వి.ఆర్ పెట్రోల్ కూడలి నుంచి అయ్యప్పస్వామి గుడి వరకు ప్రధాన మార్గంలో ఉన్న అన్ని షాపులను డాక్టర్ తనిఖీ చేశారు. డస్ట్ బిన్లను ఏర్పాటు చేయని దుకాణాలకు జరిమానాలు విధించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని