logo

బీసీ కాలనీలో మౌలిక వసతుల లేమి

పంచాయతీ పరిధిలో రెండు వార్డులున్న బీసీ కాలనీ అనేక సమస్యలతో సతమతవుతోంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీధులకు సిమెంటు రోడ్లు లేవు. కొన్ని వీధులకు ఉన్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలు లేవు.

Published : 07 May 2024 03:46 IST

వింజమూరు, న్యూస్‌టుడే : పంచాయతీ పరిధిలో రెండు వార్డులున్న బీసీ కాలనీ అనేక సమస్యలతో సతమతవుతోంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీధులకు సిమెంటు రోడ్లు లేవు. కొన్ని వీధులకు ఉన్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలు లేవు. ఇళ్లలో మురుగునీటి కోసం గుంతలు తవ్వుకుని వాటిలోకి వృథా జలాన్ని  పంపిస్తున్నారు. అవి నిండితే వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. కాలనీలో ఎవరిని కదిలించినా వీధి కాలువల సమస్యే చెబుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సిమెంటు రోడ్లే ఉన్నాయి. ఇటీవల కాలంలో రోడ్డు, కాలువలు తదితర అభివృద్ధి పనులు కనిపించటంలేదు. కాలనీలో ఎగువ ప్రాంతాల వారికి నీరందక తాగునీటికి కటకటలాడుతున్నారు. శ్మశానానికి స్థలం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

వింజమూరు-చాకలకొండ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వర్షాకాలంలో గ్రామస్థుల అవస్థలు వర్ణనాతీతం. వీధిదీపాలు సక్రమంగా వెలగడంలేదు. 20వ వార్డు బొమ్మరాజుచెరువు, జీబీకేఆర్‌ గిరిజన కాలనీలోనూ అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి.


అభివృద్ధికి నోచుకోలేదు

కాలనీలో ఐదారేళ్ల క్రితం చేసిన పనులు తప్ప కొత్తగా అభివృద్ధి ఏమీలేదు. కాలనీ సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. తాగునీరు, మురుగు కాలువలు, అపారిశుద్ధ్యంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి. కొన్నిచోట్ల సిమెంట్లు రోడ్లు నిర్మించినా వాటికి అనుగుణంగా వీధి కాలువలు లేవు. మురుగునీరు రోడ్లపై నిల్వ ఉంటోంది. పాఠశాల పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు