logo

ఉదయగిరిలో పోస్టల్‌ ఓటింగ్‌ పరిశీలన

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో  ఉద్యోగులకు కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను సోమవారం కలెక్టరు హరినారాయణన్‌ పరిశీలించారు.

Published : 07 May 2024 03:55 IST

ఉదయగిరి : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో  ఉద్యోగులకు కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను సోమవారం కలెక్టరు హరినారాయణన్‌ పరిశీలించారు.ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించే విధానాన్ని పరిశీలించటంతోపాటు ఉద్యోగులు, స్థానిక అధికారులతో మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్‌ బాలికల వసతిగృహంలో ఈవీఎంల కమిషనింగ్‌, స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజా రమేష్‌ ప్రేమ్‌కుమార్‌, ఏఆర్వో నెహ్రూబాబు పాల్గొన్నారు.


ఆలస్యంగా పోలింగ్‌

కావలి : పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియ రెండోరోజు ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్‌ గంటకుపైగానే ఆలస్యమైంది.  ప్రిసైడింగ్‌ అధికారులు 10 గంటల వరకూ వస్తూనే ఉన్నారు. ఎనిమిది గంటలకు తహసీల్దార్‌, ఏఈఆర్‌వో నగేష్‌ వచ్చారు. పోలింగ్‌ ప్రారంభం కాకపోవడంపై ఆశ్చర్యపోయారు. ఓటర్లు నిరసన తెలపడంతో సిబ్బందికి ఫోన్లు చేసి పిలిపించారు. అప్పటివరకు ఎండలోనే ఉండాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని