logo

భూ హక్కు చట్టంతో భూములు కొట్టేస్తారు

భూహక్కు యాజమాన్య చట్టం పేరుతో పేదల భూములు కోట్టేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కన్నేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నచెరుకూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 07 May 2024 04:07 IST

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: భూహక్కు యాజమాన్య చట్టం పేరుతో పేదల భూములు కోట్టేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కన్నేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నచెరుకూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లిలో సహజ వనరులను మంత్రి కాకాణి విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని తెలిపారు. పింఛన్ల పెంపుతో పాటు నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి,  తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, నాయకులు బొమ్మి సుమన్‌, సర్పంచి భాస్కర్‌, జనసేన నాయకులు పుట్టా రాకేష్‌, తెదేపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని