logo

అయిదేళ్లలో మోదీకి వారంతా మద్దతు

కేంద్రంలో మోదీ అవలంబిస్తున్న విధానాలు సమర్థిస్తూ.. ఆయన ఒత్తిడికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం, తెదేపా, జనసేనలు పనిచేస్తున్నాయని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 09 May 2024 05:43 IST

సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

మాట్లాడుతున్న బీవీ రాఘవులు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: కేంద్రంలో మోదీ అవలంబిస్తున్న విధానాలు సమర్థిస్తూ.. ఆయన ఒత్తిడికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం, తెదేపా, జనసేనలు పనిచేస్తున్నాయని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వీరు మోదీ విధానాలు అమలు చేయడం తప్ప..  వ్యతిరేకించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైకాపా, తెదేపా, జనసేనలు అడగలేదు. ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా చంద్రబాబు మోదీ చెంతన చేరారు. రాజధాని మూడుచోట్ల అంటూ వైకాపా మూడు ముక్కలాట ఆడుతుంటే జగన్‌పై మోదీ ఒత్తిడి చేయకుండా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తే వ్యతిరేకించింది ఇండియా కూటమి... అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర ఇండియా కూటమి అడుగుతోంది.. వైకాపా, తెదేపా, జనసేన అడగటంలేదు. సీపీఎం తరఫున నెల్లూరు అభ్యర్థిగా మూలం రమేష్‌, ఎంపీగా ఇండియా కూటమి కాంగ్రెస్‌ అభ్యర్థి రాజుని గెలిపించాలి’ అని కోరారు. సీపీఎం నెల్లూరు నగర అభ్యర్థి మూలం రమేష్‌, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని