logo

మండల పరిధిలో విద్యుత్ నియంత్రికల ధ్వంసం

మండల పరిధిలోని గ్రామాల్లో దుండగులు  విద్యుత్ నియంత్రికలను  ధ్వంసం చేసి ఆయిల్, రాగి తీగలను చోరీ  చేస్తున్నట్లు మండల విద్యుత్  శాఖ అధికారి మనోరంజన్ తెలిపారు.

Published : 23 May 2024 12:47 IST

నాగిరెడ్డిపేట : మండల పరిధిలోని గ్రామాల్లో దుండగులు  విద్యుత్ నియంత్రికలను  ధ్వంసం చేసి ఆయిల్, రాగి తీగలను చోరీ  చేస్తున్నట్లు మండల విద్యుత్  శాఖ అధికారి మనోరంజన్ తెలిపారు. బుధవారం రాత్రి తాండూరు గ్రామ శివారు పరిధిలో గల మూడు 25 కేవీ విద్యుత్ నియంత్రికాలను ధ్వంసం చేసి కాపర్ వైర్లను ఎత్తుకెళ్లినట్లు  స్థానిక రైతులు  అధికారులకు సమాచారమిచ్చారు.  గత 15 రోజుల నుంచి ఇప్పటివరకు మండలంలో 12 విద్యుత్ నియంత్రికలు ధ్వంసం కాగా.. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.  ఇప్పటికైనా పోలీసులు స్పందించి చోరీలు జరగకుండా చూడాలని రైతులు, అధికారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని