logo

Kamareddy: ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకున్న అధికారులు

ప్రభుత్వ భూమి కబ్జాను అధికారులు అడ్డుకున్న ఘటన రైతునగర్‌లో గురువారం చోటుచేసుకుంది.

Published : 23 May 2024 17:30 IST

బీర్కూర్: ప్రభుత్వ భూమి కబ్జాను అధికారులు అడ్డుకున్న ఘటన రైతునగర్‌లో గురువారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాలు.. రైతునగర్‌ శివారులోని రైతు వేదిక సమీపంలోని 73, 74 సర్వే నంబర్లలో ఉన్న అసైన్‌మెంట్‌ గుట్ట భూమిని అన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్‌ బ్లేడ్‌తో చదును చేశారు. గుట్ట కింద భాగం నుంచి గుట్టపై భాగం వరకు చదును చేసి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి తహసీల్దార్‌ లతకు సమాచారం అందించారు. ఆమె ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి పంచాయతీ సిబ్బందితో కలిసి ఘటన స్థలికి వెళ్లి కబ్జాను అడ్డుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు