logo

దూసుకొచ్చిన మృత్యువు

ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి మొక్కల సంరక్షణ విధులు నిర్వర్తిస్తున్న వారి బతుకుల్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు

Updated : 28 Jan 2022 03:24 IST

ఇద్దరి మృతి

బాహ్యవలయ రహదారిపై ట్యాంకర్‌ను ఢీ కొన్న కారు

ఐడీఏ బొల్లారం, జిన్నారం, న్యూస్‌టుడే: ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి మొక్కల సంరక్షణ విధులు నిర్వర్తిస్తున్న వారి బతుకుల్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. ఐడీఏ బొల్లారం శివారు ఆదర్శ పాఠశాల సమీపాన బాహ్యవలయ రహదారిపై సిబ్బంది.. క్లీనర్‌ పాపల్‌ నవీన్‌ (19), కంతిగారి సత్తయ్య (50)లు మొక్కలకు నీళ్లు పడుతున్నారు. అదేసమయంలో వెనక నుంచి వచ్చిన కారు వేగంతో ఢీకొనడంతో వీరు 50 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. నవీన్‌ది నిజామాబాద్‌ జిల్లా తాడ్వాయి గ్రామం. సత్తయ్యను హత్నూరా మండలం వడ్డేపల్లి వాసిగా గుర్తించారు. కారు నడుపుతున్న మహేశ్వరరెడ్డి రామచంద్రాపురం నివాసి. బెలూన్లు తెరుచుకోవడంతో ఇతనికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవరు మహేశ్వరరెడ్డికి శ్వాస, రక్త పరీక్షలు నిర్వహించారు. నిద్రమత్తులో ఉండి కారు వేగంగా నడపడంతోనే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఐడీఏ బొల్లారం సీఐ జి.ప్రశాంత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని