logo

ఉర్దూ అకాడమీ రాష్ట్ర ఛైర్మన్‌గా ముజీబొద్దిన్‌

తెరాస జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దిన్‌ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కౌన్సిలర్‌గా రాజకీయ రంగం ప్రవేశం చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా, రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.

Published : 01 Jul 2022 05:58 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: తెరాస జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దిన్‌ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కౌన్సిలర్‌గా రాజకీయ రంగం ప్రవేశం చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా, రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ముఖ్య అనుచరుడిగా సీఎం కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితకు నమ్మకంగా ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పటికే జిల్లాకు చెందిన తిర్మల్‌రెడ్డి, ఆయాచితం శ్రీధర్‌ రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నారు. సుమిత్రానందన్‌ను టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ సభ్యురాలిగా ఇటీవలే నియమించారు. తాజాగా నియామకంతో అధిష్ఠానం జిల్లాకు నామినేటెడ్‌ పదవుల్లో అగ్రస్థానం వేసినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని