logo

బతుకమ్మ సంబరాల్లో సభాపతి

మండల కేంద్రంలో సోమవారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Published : 03 Oct 2022 20:17 IST

బీర్కూర్‌: మండల కేంద్రంలో సోమవారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద మహిళలు, యువతులతో కలిసి ఆయన కోలాటాలతో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, సర్పంచ్‌ స్వప్న, బీర్కూర్‌, తిమ్మాపూర్‌ గ్రామాల రైసస అధ్యక్షుడు ఎ. గంగారామ్‌, రాంబాబు, తెరాస మండల అధ్యక్షుడు వీరేశం, పట్టణ అధ్యక్షుడు రాజు, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని