logo

రుణం చెల్లించకుంటే ఆస్తుల జప్తు

భూమి తాకట్టు పెట్టి సహకార సంఘాలు, ఎన్‌డీసీసీబీ శాఖల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తున్నామని డీఆర్‌ఓఎస్‌డీ గంగాధర్‌ అన్నారు.

Published : 02 Feb 2023 03:36 IST

రూ. 18 లక్షల వసూలు

బ్రాంచి అధికారులతో మాట్లాడుతున్న డీఆర్‌వోఎస్‌డీ గంగాధర్‌, ఏజీఎం యాదగిరి

జుక్కల్‌, న్యూస్‌టుడే: భూమి తాకట్టు పెట్టి సహకార సంఘాలు, ఎన్‌డీసీసీబీ శాఖల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తున్నామని డీఆర్‌ఓఎస్‌డీ గంగాధర్‌ అన్నారు. జనవరి 9న ‘ఈనాడు’లో ‘అధ్యక్షా.. ఆలకించరూ!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. బుధవారం జుక్కల్‌ వచ్చి బ్రాంచి అధికారులతో, సొసైటీ ఛైర్మన్‌ నాగల్‌గిద్దె శివానంద్‌తో మాట్లాడారు. రుణగ్రహీతలకు నోటీసులు జారీ చేశారు. కథనం ప్రచురితమైన నుంచి రుణ వసూళ్లకు చర్యలు తీసుకోవడంతో 20 రోజుల్లోనే జుక్కల్‌ మండలంలోనే రూ.18 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. తాకట్టు భూమిలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. తనఖా పెట్టిన భూమి అమ్మినా.. కొన్నా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. వెంట డీజీఎం యాదగిరి, బ్రాంచి మేనేజర్‌ సాయిలు, కార్యదర్శులు బాబురావు-జుక్కల్‌, హన్మాండ్లు- చిన్నకొడప్‌గల్‌, గంగాకిషోర్‌, నవీన్‌ ఉన్నారు.


ఆకలి తీర్చేందుకు ముందుకొస్తున్న దాతలు

దేవునిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులతో డీఈఓ రాజు, కౌన్సిలర్లు

కాసర్ల గోదావరి, కృష్ణాజీరావు, ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల వేళ వారి ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ‘ఈనాడు’లో జనవరి 29న ‘నీరసించి చదువు మరచి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందిస్తున్నారు. దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ రూ.25 వేలు, కౌన్సిలర్లు కృష్ణాజీరావు, గోదావరి ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.లక్ష విరాళం ప్రకటించారు. రెండు నెలల పాటు పిల్లలకు స్నాక్స్‌ ఇస్తామన్నారు. డీఈఓ రాజు బుధవారం పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్‌, నాయకులు కాసర్ల స్వామి, నిట్టు లింగారావు, బాలకిషన్‌, శ్రీనివాస్‌, రమణ తదితరులున్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ నర్సింలు పిల్లలకు అల్పాహారం కోసం రూ.3 వేలు విరాళం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని