logo

‘వారిద్దరూ స్థానికంగా చేసిందేమీ లేదు’

ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వారి పరిధిలో చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో భారాస సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.

Updated : 16 Apr 2024 06:41 IST

ప్రసంగిస్తున్న ఎంపీ కేఆర్‌ సురేష్‌రెడ్డి, చిత్రంలో భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

సారంగాపూర్‌: ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వారి పరిధిలో చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో భారాస సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఎంపీ అర్వింద్‌ సామాజిక మాధ్యమాల్లో తప్ప, పార్లమెంట్‌లో సమస్యలపై మాట్లాడలేదన్నారు. అదే రాజ్యసభలో తాను పసుపుబోర్డుపై మాట్లాడానని చెప్పారు. కేసీఆర్‌ అభివృద్ధి కోసం పోరాటం చేశారని, దిల్లీలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో భారాస ఎంపీలు కీలకంగా మారనున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌, బాపురెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

మద్దతిచ్చి ఎంపీగా గెలిపించండి : నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పద్మశాలీలు తనకు మద్దతిచ్చి ఎంపీగా తనను గెలిపించాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మార్కండేయ మందిరంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సభ్యులతో మాట్లాడారు. సంఘం పట్టణాధ్యక్షుడు వెంకటనర్సయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని