logo

బల్దియాలో అవినీతిరహిత పాలన అందిస్తాం

కామారెడ్డి బల్దియాలో అవినీతిరహిత పాలన అందిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Published : 16 Apr 2024 06:15 IST

మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కామారెడ్డి బల్దియాలో అవినీతిరహిత పాలన అందిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అందరి సహకారంతో కొత్త ఛైర్‌పర్సన్‌గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారని తెలిపారు. వైస్‌ఛైర్‌పర్సన్‌గా ఉరుదొండ వనితను ఎన్నుకుంటామని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణానికి నిత్యం 8 ఎంఎల్‌డీల నీరు అవసరం ఉందని.. నిత్యం 2 ఎంఎల్‌డీల నీరు మాత్రమే సరఫరా అవుతుందన్నారు. స్థానిక వనరులను ఉపయోగించి నీటి అవసరాలను అధిగమించాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు గ్యారంటీలను అమలు చేసినట్లు తెలిపారు. యువతకు 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మరో 50 వేల ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. భాజపా అభ్యర్థిగా ఉన్న బీబీపాటిల్‌ పదేళ్ల నుంచి ఎంపీగా కొనసాగుతున్నారన్నారు. ఆయన జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియానికి వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. తాను విద్యాభ్యాసం చేసిన కామారెడ్డి బాలుర పాఠశాలకు నిధులు వెచ్చించి కొత్త భవనాలను నిర్మింపజేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన గడ్డం ఇందుప్రియ షబ్బీర్‌అలీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, పట్టణాధ్యక్షుడు పండ్ల రాజు, గుడుగుల శ్రీనివాస్‌, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఐరేని సందీప్‌, చందు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని