logo

కదలాలి యువత

ఓటు నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్వీప్‌ ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అవగాహన కల్పించి నమోదు చేయించారు. పోలింగ్‌ కేంద్రాల్లోనూ శిబిరాలు నిర్వహించారు.

Published : 30 Apr 2024 06:01 IST

పార్లమెంటు పరిధిలో కొత్త ఓటర్లు 50,963

 

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌: ఓటు నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్వీప్‌ ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అవగాహన కల్పించి నమోదు చేయించారు. పోలింగ్‌ కేంద్రాల్లోనూ శిబిరాలు నిర్వహించారు. దీంతో చాలా మంది యువత ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50,963 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. వీరంతా ఈ ఎన్నికల్లో మొదటి సారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

అభ్యర్థుల గాలం

పార్లమెంటు పరిధిలో మొత్తం ఓటర్లు 17,04,867 మంది ఉన్నారు. ఇందులో 18-19 వయసు వారు 50,963 మంది, 20-29 వయసు వారు 3,69,439 మంది ఉన్నారు. అభ్యర్థులు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉండే యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు మద్దతు కోరుతున్నారు. యువతతో పాటు వారి ఇళ్లల్లో ఓట్లు తమకే పడేలా చూడాలని వేడుకుంటున్నారు.

నియోజకవర్గానికి ఒక యువ పోలింగ్‌ కేంద్రం

యువత తమ పేరు నమోదు చేసుకోవడంలో చూపిన శ్రద్ధ ఓటు వేయడంలోనూ చూపాలి. పోలింగ్‌ రోజు ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దు. ఈ సారి యువ పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గానికి ఒక యువ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయనుంది. అక్కడ విధులు నిర్వహించే వారు సైతం యువకులే ఉంటారు.

తొలిసారి ఓటు వేయబోతున్నా..

ఈ సారే నాకు ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొదటి సారి ఓటు వేయబోతున్నాను. నాతో పాటు మా స్నేహితులు కూడా నమోదు చేసుకున్నారు. మేమంతా మా హక్కును సద్వినియోగం చేసుకుంటాం. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు. నిజాయతీగా, నిర్భయంగా వేయాలి.

- శరత్‌ తేజ, నిజామాబాద్‌ నగరం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని