logo

బిల్లులు రాలేదని పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన

ప్రభుత్వ అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని పేర్కొంటూ ఓ గుత్తేదారుడు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు.

Published : 30 Apr 2024 13:55 IST

బీర్కూర్‌: ప్రభుత్వ అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని పేర్కొంటూ ఓ గుత్తేదారుడు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బీర్కూర్‌ గ్రామానికి చెందిన గుత్తేదారుడు విజయ్‌కుమార్‌ 2022లో రూ. 30 లక్షలతో పంచాయతీ వ్యాపారాల దుకాణాల సముదాయ భవనం నిర్మించాడు. రూ.20 లక్షలు చెల్లించగా మిగతా రూ. 10 లక్షల 8 వేలు మాత్రం రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆవేదన చెంది బిల్లులు ఇప్పించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయానికి తాళం వేశాడు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు వచ్చిన విషయాన్ని తెలుసుకుని ఆయన లోపల ఉండగా సదరు గుత్తేదారుడు కార్యాలయానికి తాళం వేశాడు. డీపీవో జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి బిల్లులు అమలయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయానికి తాళం తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని