logo

దోస్త్‌కు వేళాయె..!

డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Published : 05 May 2024 06:13 IST

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల  

తెవివి పరిధిలో 33,630 సీట్లు

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌: డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 74 డిగ్రీ కళాశాలల్లో 33,630 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వర్సిటీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాల కోసం తమ హాల్‌ టికెట్‌ నంబరుతో దోస్త్‌ వెబ్‌సైట్‌ https://gg.gov.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇంటర్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 మూడు విడతల్లో కేటాయింపులు

డిగ్రీ కళాశాలల్లో మూడు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. విద్యార్థులు రూ.200 రుసుము చెల్లించి రాష్ట్రంలో నచ్చిన కళాశాలలో సీటు కోసం ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్‌ 3వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్‌ 4 నుంచి 10 మధ్యలో సెల్ఫ్‌ రిపోర్టు చేయాలి.
రూ.400 రుసుముతో రెండో దశ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 4-13 వరకు చేసుకోవాలి. జూన్‌ 4-14 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం. జూన్‌ 18న సీట్ల కేటాయింపు. జూన్‌ 19-24 మధ్యలో రిపోర్టు చేయాలి.
మూడో దశలో జూన్‌ 19-25 వరకు రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జూన్‌ 19-25 వరకు వెబ్‌ ఆప్షన్లు, జూన్‌ 29న సీట్ల కేటాయింపు, జూన్‌ 29 నుంచి జులై 3వ తేదీ మధ్యలో సెల్ఫ్‌ రిపోర్టు చేయాలి.
జూన్‌ 29 - జులై 5వ తేదీ మధ్యలో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులంతా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలి. జులై 1 నుంచి కళాశాలల్లో పునశ్చరణ జరుగుతుంది. జులై 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

కొత్త కోర్సులు

డిగ్రీ కోర్సులకు ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు ముమ్మరంగా కల్పించేందుకు మరికొన్ని కొత్త కోర్సుల ప్రారంభానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీ.కామ్‌ ఫైనాన్స్‌తో పాటు బీఎస్సీ బయో మెడికల్‌ సైన్స్‌, బీఏ స్పెషల్‌, బీఏ పబ్లిక్‌ పాలసీ లాంటి నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని