logo

83 యూనిట్ల రక్త సేకరణ

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో సమాజ సేవకులు, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తశిబిరం విజయవంతం అయింది.

Published : 05 May 2024 18:37 IST

కామారెడ్డి పట్టణం: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో సమాజ సేవకులు, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తశిబిరం విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తలసేమియా చిన్నారుల కోసం 82 మంది రక్తదాతలు రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు, డాక్టర్ వేదప్రకాష్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, జమీల్ హైమద్, ఎర్రం చంద్రశేఖర్, వెంకటరమణ, కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, రంగ కిషన్, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి, నవీన్, నరేందర్, రాజా గౌడ్, సాయిలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని