logo

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగళ్ల వాన

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది.

Published : 05 May 2024 19:03 IST

భువనగిరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు చేసి మిల్లులకు తరలించేందుకు లారీలలో నిలువ చేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. యాదాద్రి జిల్లాలోని గుండాల, వలిగొండ, మోత్కూరు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నల్లగొండలో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. చండూరు. చిట్యాల, నకిరేకల్, నాంపల్లి, నూతనకల్, నార్కట్పల్లి, ప్రాంతాలలో వడగల్లు పడ్డాయి. ఈదురు గాలులతో మిర్యాలగూడ, హాలియా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని