logo

మత్తు పదార్థం పట్టివేత.. నలుగురి అరెస్టు

నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న నలుగురిని భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం భిక్కనూరు సీఐ సంపత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పెద్దమల్లారెడ్డి శివారులో కారులో అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేసి ముగ్గురిని పట్టుకున్నారు.

Published : 06 May 2024 04:35 IST

వివరాలు వెల్లడిస్తున్న భిక్కనూరు సీఐ సంపత్‌

భిక్కనూరు, న్యూస్‌టుడే: నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న నలుగురిని భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం భిక్కనూరు సీఐ సంపత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పెద్దమల్లారెడ్డి శివారులో కారులో అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేసి ముగ్గురిని పట్టుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో జంగంపల్లి శివారు బీటీఎస్‌ వద్ద మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులుగా గుర్తించిన వారిలో నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్‌కు చెందిన గొల్లపల్లి నరేష్‌గౌడ్‌, మాక్లూర్‌కు చెందిన ఎల్లగోని సంతోష్‌గౌడ్‌, సంగం గ్రామానికి చెందిన కేసరి మల్లికార్జున్‌గౌడ్‌, కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన భీమగోని దత్తాత్రిగౌడ్‌ ఉన్నారు. వారి నుంచి కారు, రూ.2.50 లక్షల విలువైన 248 గ్రాముల అల్ప్రాజోలం, 4 చరవాణులు, రూ.37,020 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమెదు చేసి కామారెడ్డి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్‌ విధించారు. వారిని నిజామాబాద్‌ జైలుకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఎస్సై సాయికుమార్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని