logo

పోలింగ్ సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలి: కలెక్టర్‌

ఎన్నికల విధుల్లో శిక్షణ పొందిన సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు.

Published : 06 May 2024 19:53 IST

కామారెడ్డి పట్టణం: ఎన్నికల విధుల్లో శిక్షణ పొందిన సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ఏపీవోలకు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మంగళవారం మాస్టర్ శిక్షకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సిబ్బంది నడుచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రధానంగా పీవోలు, ఏపీవోలు పోలింగ్ సమయంలో ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే సెక్టోరియల్ అధికారి దృష్టికి తేవాలన్నారు. బ్యాలట్ యూనిట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఓటర్ల చేతి వేలికి సిరాను సక్రమంగా పూయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని